రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ / బిజెపి వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో సంగెం నుండి చౌటుప్పల్ వరకు రహదారి నిర్మాణం కొరకు 18 కోట్లు మంజూరు చేయించిన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి కి పాలాభిషేకం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు శ్రీ పి.వి.శ్యామ్ సుందర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంగెమ్ నుండి చౌటుప్పల్ వరకు రోడ్డు నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రజలు ఎదురు చూశారు.చివరకు కేంద్ర మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి చొరవతో 48 ప్రాజెక్టులకు 858 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయించడం జరిగింది.అందులో సంగెం నుండి చౌటుప్పల్ వరకు 18 కోట్ల రూపాయలు మంజూరు చేయించిన కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి కి జిల్లా బిజెపి పార్టీ తరుపున,మండల శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజా సమస్యలు గాలికి వదిలి కేవలం బిజెపి పై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధికి కేసీఆర్ చేసింది శూన్యం అని,కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు.ఈ నెల 12న ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో కాస్తో కూస్తో గ్రామాల అభివృద్ధికి నిధులు విడుదల చేస్తారేమో అని ఆశపడ్డామని కానీ ఆయన పర్యటనతో జిల్లాకు ఒరిగింది ఏమిలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నగవేల్లి సుధాకర్ గౌడ్ ,జిల్లా ఉపాధ్యక్షుడు దంతూరి సత్తయ్య , చందా మహేందర్ గుప్తా,జిల్లా ప్రధాన కార్యదర్శి నర్ల నర్సింగరావు,జిల్లా సెక్రటరీ కొండే ఉపేందర్ గౌడ్,జిల్లా నాయకులు పిట్టల అశోక్,రాచకొండ కృష్ణ,బీజేవై యం జిల