రాయల్ పోస్ట్ న్యూస్ భువనగిరి’! తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠ శాలల్లో ప్రవేశాల కోరకు దరఖాస్తుల ఆహ్వానం :
తెలంగాణ రాష్ట్ర క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి మరియు 5 వ తరగతి లో ప్రవేశాల కోరకు VC & MD, SATS & Director, TSSS, Hakeempet వారి ఆదేశాల ప్రకారం హకీంపేట్/ఆదిలాబాద్/కరీంనగర్ లలో ప్రవేశములు మూడు దశలలో అనగా మండల స్థాయి / జిల్లా స్థాయి / రాష్ట్ర స్థాయి లలో నిర్వహించబడును.
I.)మండల స్థాయిలో జరిగే బాల బాలికలకు మండల విద్యాదికారి ఆద్వర్యంలో పోటీలు నిర్వహించబడును. ఇట్టి పోటీలు తేది 19 –02–2022 లోపు అన్ని మండలాలలో జరుగును. కావున ఈ క్రింది అర్హతలుగల బాల బాలికలు తమ తమ మండలము లోని M.E.O గారు నిర్ణయించిన తేదిలలో పోటిలకు హజరుకాగలరు.
ఎంపిక విధానము:
1) .ఎత్తు 2). బరువు 3). 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ 4). స్టాండింగ్ బ్రాడ్ జంప్ 5). ఫ్లెక్సిబిలిటీ టెస్ట్
6) 6 X 10 మీటర్ల షటిల్ పరుగు 7) వర్టికల్ జంప్ 8) మెడిసిన్ బాల్ త్రో 9) 800 మీటర్ల పరుగు
అర్హతలు :
 4వ తరగతిలో ప్రవేశము కొరకు 8 నుండి 9 సo,, మద్య వయస్సు గల విద్యార్థినీ విద్యార్థులు
తేది:31-08-2012 నుండి తేదీ 31-08-2013 మద్య జన్మించినవారై ఉండాలి.
 5 వ తరగతిలో ప్రవేశము కొరకు 9 నుండి 10 సo,, మద్య వయస్సు గల విద్యార్థినీ విద్యార్థులు
తేది:31-08-2011 నుండి తేదీ 31-08-2012 మద్య జన్మించినవారై ఉండాలి.
తీసుకురావలసిన పత్రాలు:

  1. వయస్సు మరియు విద్యార్హత పత్రము ప్రస్తుతము చదువుచున్న పాఠశాల వారు జారీ చేసినది.
  2. పుట్టిన తేదీ ధృవ పత్రము గ్రామ పంచాయతీ లేదా మునిసిపాలిటీ లేదా తహశీల్దార్ వారు జారీ చేసినది.
  3. 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ / 4 వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్ జీరాక్స్ ప్రతులు.
  4. ఇటీవల దిగిన పాసుపోర్ట్ సైజ్ (10) ఫోటోలు.
  5. ఆధార్ కార్డ్.
  6. కుల ద్రువికరణ పత్రం.
    II).మండల స్థాయిలో ఎంపికైన బాల బాలికలకు జిల్లా స్థాయిలో తేది 26-02-2022 రోజున, స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలుర), భువనగిరి నందు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి గారి ద్వారా PD/ PET ల ఆద్వర్యంలో నిర్వహించబడును.
    III).మా ర్చి 9 & 10, 2022 న జరుగు రాష్ట్ర స్థాయి ఎంపికకు గాను జిల్లా స్థాయిలో ఎంపికైన జాబితాను పంపబడును. కె.ధనంజనేయులు జిల్లా యువజన మరియు క్రీడల అధికారి యాదాద్రి భువనగిరి జిల్లా