రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించడం న్యాయ సమ్మతం అని భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ భానోతు వెంకట నర్సింగ్ నాయక్ అన్నారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహం కు జ్ఞానమాల (61) సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఎంతో కృషి చేశాడని, ఆ రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించక పోవడం ధారుణమన్నారు. కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రించే వరకు పోరాటం చేయాలని, ఆ పోరాటానికి సంపూర్ణ మద్దతు అందిస్తామన్నారు. ఈ జ్ఞానమాల కార్యక్రమం లో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి.(CAPSS) జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్, జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య, సాధన సమితి జిల్లా నాయకులు మహ్మద్ సలావుద్ధీన్, భానోతు భాస్కర్ నాయక్, బర్రె రమేష్, బండారు శివ శంకర్,, సాల్వేరు ఉపేందర్, నాయిని పూర్ణచందర్, భానోతు రాజేష్ నాయక్, నర్సింహ నాయక్, అప్పయ్య నాయక్, సురేంధర్ నాయక్ , మహేష్ నాయక్ ,కమల్ నాయక్,, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు..