రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: విద్యాలయాల్లో విద్వేశాలు రెచ్చగొట్టే కుట్రను వ్యతిరేకించాలి

ఎస్.ఎఫ్.ఐ భువనగిరి టౌన్ మహాసభలో జిల్లా అద్యక్ష,కార్యదర్శులు

కర్ణాటక రాష్ర్టంలో హిజాబ్ పేరుతో విద్యనభ్యసించే విద్యాలయాల్లో విద్వేశాలు రేచ్చగొట్టి విద్యార్థుల్లో మత వైశమ్యాలు రెచ్చగొట్టే చర్యను ప్రతిఘటించాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా అద్యక్ష,కార్యదర్శులు వనం రాజు,బొడ్డుపల్లి వెంకటేశం అన్నారు. ఈర్ల రాహుల్ అద్యక్షతన స్థానిక శ్రీచైతన్య కళాశాలలో భువనగిరి ఎస్.ఎఫ్.ఐ పట్టణ 15వ మహాసభ జరిగింది. ఈ మహాసభలో జిల్లా కార్యదర్శి బొడ్డుపల్లి వెంటేశం ఎస్.ఎఫ్.ఐ పతాకాన్ని విష్కరించగా, మాజీ కౌన్సిలర్ మాయ కృష్ణ,జిల్లా అద్యక్షుడు వనం రాజు అమరవీరులకు పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బేటి పడావో,బేటీ బచావో అంటూ ప్రచారాలు చెస్తూ కర్ణాటక రాష్ర్టంలో విద్యాసంస్థల్లో మతాల మద్య బిజేపి సర్కార్ చిచ్చు పెడుతూ రాజకీయలబ్థి పొందుతుందన్నారు. చదువుకోవాల్సిన విద్యార్థుల్లో వైశమ్యాలు ప్రేరేపించి విబజన చేస్తూ మైనారిటీ ఆడపిల్లలను చదువుకు దూరం చేయాలనె కుట్ర చేస్తూందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తూ మతోన్మాదం సృష్టించడం సరికాదన్నారు. దేశంలో ఏక్కడా లేని విదంగా ఇలాంటి నిబందనలు తేవడం ఎంటని ప్రశ్నించారు. వేసుకునే దుస్తువులపై,తినే తిండిపై ఆదిపత్యం చేయడం సరైందికాదని ఇలాంటి ఘటనలపట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని ప్రజాస్వామాకవాదులు,మేదావులు,అభ్యుదయవాదులు ఇలాంటి చర్యలను ప్రతిఘటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ టౌన్ అద్యక్ష,కార్యదర్శులు ఈర్ల రాహుల్,చింతల శివ, పల్లేర్ల సందీప్,ఉపాద్యక్షులు యం.డి రహాన్,కొల్పుల సోహన్,నేహాల్,సహాయ కార్యదర్శులు దండిగ సంతోష్,నేల్లిగొండ శివ నాగేందర్,బుగ్గ ఉదయ్,సోహేబ్,నాగారం శివ,ఈర్ల కార్తీక్,యువకిషోర్ రెడ్డి,నెల్లిగొండ సాయి,అజయ్,రాజేష్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.