రాయల్ పోస్ట్ ప్రతినిధి           భువనగిరియాదాద్రి :నిన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో సమీకృత కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటన వల్ల ఎంతో ఆశలు పెట్టుకున్న భువనగిరి పట్టణ ప్రజలు నిరాశ గానే మిగిలిపోయింది 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉండి జిల్లాలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు జడ్పీ చైర్మన్,మున్సిపల్ చైర్మన్ మండల పరిషత్ అధ్యక్షులు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఉండి కూడా భువనగిరి నియోజకవర్గం భువనగిరి పట్టణ సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చెయ్యాలని కెసిఆర్ తో కనీసం మాట్లాడకుండా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలిపోయారు కెసిఆర్ సభ పట్టణానికి ఒరిగింది ఏముంది

1,పట్టణంలో వికలాంగులకు,వయో వృద్ధులకు,ఒంటరి మహిళలకు,భర్తలను కూలిపోయిన వితంతువులకు గత ఐదు సంవత్సరాల నుండి నూతన ఆసరా పింఛన్లు లేక ఉన్న వాళ్లకు లాభం చేకూరిందా
2,గత ఆరు సంవత్సరాలుగా సింగన్నగూడెంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి బూత్ బంగ్లా మారిన ఇండ్లను పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేకూరిందా
3,సింగన్నగూడెం స్మశాన వాటికను స్పృతి వనంగా అభివృద్ధి పరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రారంభించినందుకా
4, దళితుల కోసం బైపాస్ రోడ్డులో 2017 డిసెంబర్ 2న అంబేద్కర్ భవన్ నిర్మాణ శంకుస్థాపన చేసి నేటికీ ఐదు సంవత్సరాలు పూర్తయిన భవనం పూర్తి చెయ్యలేనందుకా
5,భువనగిరి పురపాలక సంఘానికి నిధులు మంజూరు చేసినందుకా
6,పట్టణ ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు లో డబ్బాలు మడిగెలు ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇచ్చినందుకా డబ్బా కార్మికులకు ఏమన్నా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినందుకా
7,పట్టణంలో ఇండోర్ స్టేడియం అవుట్ డోర్ స్టేడియం టౌన్ హాల్ నిర్మాణం మంజూరు చేసినందుకా
8,భువనగిరి తహసీల్దార్ కార్యాలయం కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న దానికోసం నూతన తహసీల్దార్ కార్యాలయం నిర్మాణంకై నిధులు మంజూరు చేసినందుకా
9,భువనగిరి పురపాలక సంఘం నుండి నిధులు డైవర్ట్ చేసుకొని ఇంటిగ్రేటెడ్ సమీకృత మార్కెట్ నిర్మిస్తున్న దాన్ని నిధులను భువనగిరి పురపాలక సంఘానికి ఇచ్చినందుకా

ఇలా చెప్పుకుంటూపోతే 2014 ఎన్నికలలో మరియు 2018 ఎన్నికలలో బహిరంగ సభలో పెట్టి యాదాద్రి భువనగిరి జిల్లాకు అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు కూడా శంకుస్థాపన చేసిన పనులకు నిధులు లేక ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వేసినట్లుగా ఉన్నవి అలాగే శంకుస్థాపన నోచుకోలేనివి ఎన్నో ఉన్నాయని నిన్న జరిగిన బహిరంగ సభతోనైనా నిధులు మంజూరు చేస్తారాని సంక్షేమ పథకాలు అమలు చేస్తారని కోటి ఆశలు పెట్టుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలకు నిరాశగానే మిగిల్చినారు అన్నారు