రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి: జిల్లాకేంద్రంలోని స్థానిక రహదారి బంగ్లాలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ 2022 నూతన డైరీ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ ఆదివారం ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పక్షాన తెలంగాణ జర్నలిస్టులు పనిచేస్తుందని, జర్నలిస్టుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని లేనిపక్షంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ తరపున పోరాటం చేస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండి. ఖాజా పసిఉద్దీన్, గౌరవ అధ్యక్షులు సిహెచ్. మత్యాస్,ప్రధాన కార్యదర్శి ఎం. ఉదయ్ కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. వెంకన్న, ఆర్గనైసింగ్ జనరల్ సెక్రెటరీ బి. నరేష్,అదికార ప్రతినిధి దీరావత్ లింగ,జిల్లా మహిళా అధ్యక్షురాలు డి. లావణ్య, జిల్లా మహిళా కార్యదర్శి టి.అరుణ,జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డి. అంబికా, ఉపాధ్యక్షులు రషీద్, అబ్దుల్ రెహ్మాన్, జిల్లా సహాయ కార్యదర్శి పి.కుమార్,జిల్లా కార్యవర్గ సభ్యులు డి. భరత్, బి.విజయ్ రాజ్,మోటకొండూర్ మండల కార్యదర్శి కే మల్లేష్ యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు సిహెచ్ రాజు గుండాల మండల అధ్యక్షులు జి మహేందర్ ఆత్మకూర్ మండల ప్రధాన కార్యదర్శి మేడి శ్రీనివాస్ కార్యదర్శి షేక్ అజిత్ పట్టణ ఉపాధ్యక్షులు రమేష్ మండల కార్యదర్శి ఎండి జాకీర్ తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు