రాయల్ పోస్ట్ న్యూస్ సంగారెడ్డి: సంగారెడ్డి పట్టణం శాంతినగర్ కాలనీలో నివాసముంటున్న కృష్ణవంశీకి జరిగిన రోడ్డు ప్రమాదంలో మెదడు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లాడు. వైద్య శస్త్ర చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో సంగారెడ్డి పట్టణానికి చెందిన అయ్యప్ప ఆపద్భాందవ సేవా సమితి ఆధ్వర్యంలో 50 వేల రూపాయల చెక్కును ఆదివారం వంశీకృష్ణ తల్లికి అందజేశారు. చిన్న తనంలోనే వంశీకృష్ణ తండ్రి చనిపోవడంతో తల్లి ఎంతో కష్టపడి పోషిస్తూ ఉన్నత చదువులు చదివిస్తుంది. చదువుల్లో ముందుండే కృష్ణ వంశీ నర్సాపూర్ సమీపంలోని బీవిఆర్ ఐటిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అతడికి రోడ్డు ప్రమాదం జరగడంతో సుమారు ఆరు లక్షల రూపాయలు ఖర్చు కావడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలోకి చేరుకుంది. విషయం తెలుసుకున్న అయ్యప్ప ఆపద్భాందవ సేవా సమితి ఆధ్వర్యంలో యాబై వేల రూపాయల చెక్కును బీరంగూడలోని పనేషియా మెరిడియన్ ఆసుపత్రిలో బాధితుడు కృష్ణ వంశీ తల్లికి అందజేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆపద్భాందవ సేవా సమితి సంగారెడ్డి అధ్యక్ష, కార్యదర్శులు ఎం. సత్యనారాయణ, సాహితీ రాము, కోశాధికారి మాణిక్ రెడ్డి, సభ్యులు జనప్రియ రాజు సేటుతో పాటు పలువురు పాల్గొన్నారు.