భువనగిరి : యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని సినీ నటి, నగరి ఎమ్యెల్యే రోజా శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకప్పుడు యాదాద్రి ఆలయానికి ఇప్పుడున్న ఆలయాన్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, యాదాద్రి ఆలయం అభివృద్ధి భగవంతుడు కేసీఆర్ చేతుల మీదుగా జరుపుతున్నారని, అందుకే కేసీఆర్ కారణజన్ముడని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి దేవస్థానంలా తెలంగాణాలో యాదాద్రి దేదీప్యమానంగా విరాజిల్లనుందని అన్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆశీర్వాదాలు కేసీఆర్ తోపాటు తెలంగాణ ప్రజలందరికీ ఉంటాయని ఆమె అన్నారు.