రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా: బొమ్మలరామారం మండలంలోని మునిరాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోగల సర్వే నెంబర్ 66 లో ప్రభుత్వ,అసైన్డ్ భూములు,రైతుల భూములకు ఒకే సర్వే నెంబర్ అనగా 66 ఉండడంతో రెవెన్యూ అధికారులు పట్టా భూములను అసైన్డ్ భూములగా భావించి పెండింగ్ లాగిన్ రెడ్ మార్క్ పెట్టడంతో రైతులు ఆపద సమయంలో క్రయవిక్రయాలకు ఆటంకం ఏర్పడుతుంది.వెంటనే రెవెన్యూ అధికారులు చొరవ తీసుకొని అసలైన పట్టాదారు లకు కొనుగోలు అమ్మకాలు స్లాట్ బుకింగ్ అనుమతించాలని రైతులు కోరారు. ఈ సర్వే నెంబర్లు సుమారు 80 మంది రైతులు 240 ఎకరాల పట్టాదారుల వ్యవసాయ భూమి కలిగి ఉన్నారు.
ఈ కార్యక్రమంలో మాదిరెడ్డి నారాయణరెడ్డి ,ఉప్పల బాబు, మాదిరెడ్డి సంజీవరెడ్డి, మహేందర్, ఉప్పల వెంకటేష్, ఉప్పల బాలేష్ ,ఘన బోయిన రమేష్ ఘనమైన కుమార్, కాసాని కిష్టయ్య ,కాసాని అంజయ్య ,కాసాని రాములమ్మ, మాదిరెడ్డి లక్ష్మారెడ్డి ,మాదిరెడ్డి పెంటా రెడ్డి, మాదిరెడ్డి భవాని, కేతావత్ లచ్చిరాం, కేతావత్ మోతీ రామ్, కేతావత్ బాల నాయక్, కేతావత్ రాజు ,కేతావత్ శంకర్ ,మర్రి అండాలు, మాదిరెడ్డి బాల్ రెడ్డి, మాదిరెడ్డి రవీందర్ రెడ్డి, మాదిరెడ్డి విజయ నాగిరెడ్డి, చంద్రకళ దూసరి పోచమ్మ ,ఉప్పల కృష్ణ ,తాళ్ల బాలయ్య, కటికల ఎల్లయ్య మాదిరెడ్డి బల్వంత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ,రైతులు పాల్గొన్నారు.