• ప్రజా సమస్యలను తీర్చడానికే మా పోరాటం,యాదాద్రిలో గుండాల మండలాన్ని సంపూర్ణంగా కలపాలని డిమాండ్.

గుండాల, ఫిబ్రవరి 11(రాయల్ పోస్ట్ న్యూస్) :
గుండాల మండలాన్ని జనగామ జిల్లాలో విలీనం చేసినప్పటి నుండి గుండాల మండల విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేపట్టింది అని మండల సాధన సమితి అధికార ప్రతినిధి, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు గూడ మధు సూదన్ గౌడ్ అన్నారు. శుక్రవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఉద్యమాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో విలీనం చేస్తున్నామని జీవో నెం: ఎం ఎస్ 20 ని 2019 ఫిబ్రవరి 23 న విడుదల చేసింది. కొన్ని శాఖలకే పరిమితమైంది, ఇప్పటికి పోలీస్ శాఖ వరంగల్ కమిషనర్ రేట్ పరిధిలోనే కొనసాగుతుంది, తక్షణమే పోలీస్ శాఖను రాచకొండ కమిషనర్ రేట్ పరిధిలోకి మార్చాలి అని డిమాండ్ చేశారు. 2016 నుండి మొదలు పెడితే 2022 ఇప్పటి వరకు గుండాల మండల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కాబట్టి మండల ప్రజలు కేసీఆర్ భువనగిరి సభకు వెళ్ళకుంటే ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్తుంది అని అభిప్రాయం వ్యక్తం చేశారు, లేని పక్షంలో సమస్య జటిలమవుతుంది ఆవేదన వ్యక్తం చేశారు. మరో మారు జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో గుండాల సమస్య పై పోరాటం చేస్తామని తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పిలుపు నిచ్చింది. దళిత బంధు, కొత్త పెన్షన్లు మంజూరు విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని, కేసీఆర్ సభను కచ్చితంగా అడ్డుకుని ఆయనకు ప్రజల బాగా అర్థమయ్యేలా చేస్తామని తెలిపారు.