రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న డబల్ బెడ్రూమ్ ఇల్లు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో పైన పటారం లోన లొటారం అసంపూర్తిగా ఉన్నాయని పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టిపల్లి అనురాధ అన్నారు* *ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి చేసి అర్హులైన పేదలకు ఇవ్వాలని కోరుతూ బెడ్ రూమ్ ఇండ్ల కాడ ధర్నా నిర్వహించడం జరిగింది* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ// రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఆర్బాటంగా అనేక మోసపూరిత వాగ్దానాలు చేసి ఇల్లు లేని నిరుపేదలు అందరికీ డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి ప్రభుత్వం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మాణం పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఏండ్లు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదని నల్లా, లిఫ్ట్ చేయలేదని వాటర్ సౌకర్యం లేదని, కరెంట్ కరెంట్ సౌకర్యం లేదని, పట్టణంలో ఇల్లు లేని పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పూర్తి చేసి డబల్ బెడ్ రూమ్ ఇవ్వాలని లేదంటే సమీకరించి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఆక్రమించుకోవడం జరుగుతుందని అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. *సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి పాండు మాట్లాడుతూ//* సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు తీసిన ఫలితంగానే ఇందిరమ్మ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టలేక తప్పలేదని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం పనులు పూర్తి చేయాలని పేదలకు వెంటనే ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ. నాయకులు దండు యాదగిరి, కొలుపుల కృష్ణ, ఓట్ల ఎల్లయ్య, నవద్, కృష్ణ, వనం గిరి అరుణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.