గుండాల ఫిబ్రవరి11(రాయల్ పోస్ట్ న్యూస్): గుండాల మండల పరిధిలోని వస్తా కొండూరు గ్రామంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది గ్రామస్తులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బెజ్జాల లక్ష్మి నరసయ్య మూడు రోజుల క్రితం ఊరికి వెళ్లారు తిరిగి వచ్చి చూడగా ఇల్లు తాళం పగులగొట్టి ఉన్నది బెడ్ రూమ్ లో ఉన్న బీరువా తాళం పగలకొట్టి 10 తులాల బంగారం రెండు వేల రూపాయల నగదు వెండి సామాగ్రి తీసుకెళ్లినట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో కూడా తుర్కలషాపురం గ్రామంలో ఒకే రోజు మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది ఊరికి వెళ్లిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్నారని అదే తరహాలో వస్తాకొండూరు గ్రామంలో కూడా ఊర్లో లేని ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు తెలియజేశారు.