సర్వే నంబర్ 66 లో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని జేసికి రైతులు వినతి.

రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:యాదాద్రి భువనగిరి జిల్లా:బొమ్మరామరం మండలం మునీరాబాద్ గ్రామపంచాయతీ పరిధిలోని గల 66 సర్వే నెంబర్లో అసైన్డ్ భూములను పట్టా భూములు గా మార్చిన అక్రమార్కుల పై విచారణ చేపట్టి అసలు పట్టదారులకు న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాస రెడ్డికి గ్రామ రైతులు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వేనెంబర్ 66 లో ప్రభుత్వ భూమి పట్టాదారుల భూములకు ఒకే సర్వేనెంబర్ ఉండడంతో అసైన్డ్ భూములను కొనుగోలు చేసి పట్టా భూములుగా నల్ల నర్సింహారెడ్డి, తొంట బాలనర్సయ్య అక్రమంగ 30 ఎకరాల భూమాని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అలాంటి వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
అసలు పట్టాదారులు
భూములు అమ్ముకోలేక కొనలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ,వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో 66 నెంబర్ గల భూమిని సర్వే చేసి విచారణ చేపట్టాలని కోరినట్టు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎం.లక్ష్మ రెడ్డి,మాధవ రెడ్డి ,వెంకటేష్, ప్రసాద్ రెడ్డి ,వేణుగోపాల్ రెడ్డి నవపాల్, విష్ణు ,సంజీవ రెడ్డి, నారాయణ రెడ్డి, బాల్ రెడ్డి బాబు, కుమార్, రమేష్ నరసింహ, రాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.