రాయల్ పోస్ట్ ప్రతినిధి గుండాల భువనగిరి: పెద్దపడిశాల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన శాఖాపురం చంద్రయ్య కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసిన:పెద్దపడిశాల MPTC కోర్న నరేష్
కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన కాంగ్రెస్ నేతలు
ఈ రోజు గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మరణించిన శాఖాపురం చంద్రయ్య గారు మరణించిన విషయం తెలుసుకున్న స్థానిక ఎంపీటీసీ కోర్న నరేష్ గారి సహకారంతో పెద్దపడిశాల కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆకుల ఆంజనేయులు గారి చేతులు మీదుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలిపి మీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ బందెల ప్రమోద్,వార్డు సభ్యులు ఆకుల మహేందర్,ఆకుల మల్లేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల శ్రీను,కందుకూరి చందు,బెజగం బాలమల్లు,బందెల పరుషరాములు,శాఖాపురం రమేష్,ఎర్ర ఎల్లేష్,ఎర్ర పరుషరాములు,గడ్డం వెంకన్న,గడ్డం పరుషరాములు,Md అహమ్మద్, Md మైబుపాషా,మరియు తదితరులు పాల్గొన్నారు.