రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10ఫిబ్రవరి గురువారం రోజున మధ్యాహ్నం 12గంటలకు స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద హిజాబ్ పై నిరసన చేపట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ అధ్యక్షులు షేఖ్ మజర్ బబ్లు తెలిపారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లొ జరిగిన మైనారిటీ సమావేశం లొ పాల్గొని వారు మాట్లాడుతూ కర్ణాటక లొ గత కొన్నిరోజులుగా ముస్లిం విద్యార్థులను హిజాబ్ వేసుకొని వస్తే కళాశాలలో ప్రవేశం లేదని వారిని అనుమతించకపోవడం అనేది నపుంసక చర్య అని కర్ణాటక బీజేపీ ప్రభుత్వం పై మండి పడ్డారు.అలాగే ఇస్లాం మతం లొ బుర్ఖ ధరించడం అనేది ఆనటి నుండి వస్తున్న ఆచారం అని అన్నారు. మరియు హిజాబ్ ధరించడం వలన మన దేహ షరీరాన్ని కప్పి పుచ్చుతుంది.అనేది తెలుసుకోవాలని ప్రజాస్వామ్యం లొ ఎవరి ఇష్టం ప్రకారం వారు జీవించే హక్కు ఉందని.అన్నారు మరొక్క సారి ఏ ప్రభుత్వం అయినా ముస్లిం మైనారిటీ ల జోలికొస్తే ఊరుకునేది లేదని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అలాగే నేడు జరగబోయే కార్యక్రమం లొ అధిక సంఖ్యలో కాంగ్రెస్ మైనారిటీ నాయకులు మహిళలు కౌన్సిలర్లు ఎన్ ఎస్ యు యి యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘ నాయకులు విద్యార్థినులు అధిక సంఖ్య లొ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమం లొ టీపీసీసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి ఎండీ రఫీయొద్దీన్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ అవేస్ చిస్తీ,మైనారిటీ సీనియర్ నాయకులు
ఎండీ నజీర్,ఎండీ కబీర్ ఎండీ ఆబేద్ అలీ ఎండీ సలవొద్దీన్ ఫసియొద్దీన్
ఎండీ బురాన్,ఎండీ ఆమెర్ తదితరులు పాల్గొన్నారు