రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: VRaలకు పే స్కేల్ ,వెంటనే విడుదల చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వాలని తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి వంగూరు రాములు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ రెవెన్యూ సహాయకుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కైరం కొండ బాలమణి అధ్యక్షతన ధర్నా జరిగినది ఈ ధర్నాకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన వంగురి రాములు మాట్లాడుతూ 20 20 సెప్టెంబర్ 9న అసెంబ్లీ సాక్షిగా నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెడుతూ వీఆర్ఏలకు కొనసాగిస్తామని vra పే స్కేల్ అమలు చేస్తామని హామీ ఇచ్చి,నేటికీ 18 నెలలు గడిచినా అమలు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తక్షణమే ఫేస్కేల్ అమలుకు జీవోలు, విడుదల చేయాలని చేయని పక్షంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపడతామని అన్నారు.

వీఆర్ఏల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ కరోన సమయంలో ముందు వరుసలో ఉండి పనిచేసిన vra లు చనిపోతే ప్రభుత్వం ప్రకటించిన యాభై లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో మండల అధ్యక్షుడు చింతల పెంటయ్య ,vra లు అర్జున్ నవతా ,ఎల్లయ్య ,సత్తయ్య, మాధవరెడ్డి ,జానీ ,లావణ్య మరియు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పొత్నక్ ప్రమోద్ కుమార్ కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేశ్వర్లు, ఈరపాక నరసింహ, కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, బీఎస్పీ నాయకులు లింగస్వామి, తదితరులు పాల్గొన్నారు.