గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన పలువురు నాయకులు
భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు
భారత రాజ్యాంగం జోలికొస్తే ఎవరికైనా పతనం తప్పదు.
భారత ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.

గుండాల మండలంలోని పెద్దపడిశాల గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఆవరణంలో భారత రాజ్యాంగంతో పదవిని పొంది రాజ్యాంగాన్ని మార్చాలని భారత రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని గుండాల మండల MSF అధ్యక్షులు కందుకూరి చందు మాదిగ డిమాండ్ చేశారు.సోమవారం అంబేద్కర్ విగ్రహం వద్ద విగ్రహానికి పాలాభిషేకం చేసి భారీ ఎత్తున నిరసన ప్రదర్శన తెలిపి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఆకుల ఆంజనేయులు దహనం చేసి నిరసన తెలపడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో ఉపసర్పంచ్ బందెల ప్రమోద్,వార్డు మెంబెర్ ఆకుల మహేందర్,అంబేద్కర్ యువజన కమిటీ అధ్యక్షుడు ఎర్ర సైదులు,ఉపాధ్యక్షుడు బందెల పరుషరాములు,నత్తి కొండయ్య కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీను,బెజగం బాలమల్లు,ఎర్ర ఎల్లేష్,మచ్చ యాదగిరి,మరియు అంబేద్కర్ కమిటీ నాయకులు గడ్డం మల్లేష్, విద్యార్ధిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు