రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామ యువతతో గ్రామ సమస్యలు మరియు మాదక ద్రవ్యాలు,గంజాయి నిర్మూలనపై సర్పంచ్ బీరప్ప సమావేశం ఏర్పాటు చేశారు.
నాగినేనిపల్లి గ్రామంలోని గ్రామ సర్పంచిగా పలు అభివృద్ధి కార్యక్రమాల పైన మరియు గ్రామంలోని సమస్యల పైన మరీ ముఖ్యంగా గంజాయి మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు మీటింగ్ ఏర్పాటు మరియ * ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి మేడం గారి సహకారంతో,కృషితో మల్టీ పర్పస్ యూత్ బిల్డింగ్ & గ్రంధాలయం,ఓపెన్ జీమ్ మంజూరు చేసిన విషయాన్ని యువతకు తెలియపరుస్తూ అది ఎక్కడ నిర్మించుకోవాలని పలు సలహాలు సూచనలు తీసుకుంటూ.* యువత అడిగిన గ్రామంలోని సమస్యలను మరియు అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా గ్రామ పెద్దల మరియు గ్రామ యువత అండదండలతో వాటిని పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమాన్నికి విచ్చేసి విజయవంతం చేసిన యువకుల అందరికీ పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.