రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా: మాజీ జర్నలిస్ట్, వాణిజ్యవేత్త మాదాసు అశోక్ కుమార్తె డాక్టర్ ప్రణీత వివాహం అరవింద్ పటేల్ తో ఈరోజు భువనగిరి పట్టణంలోని సాయి కన్వెన్షన్ హాల్ లో వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకలో తెలంగాణ చిన్న పత్రికల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ బాబు, పాల్గొని నూతన జంటను ఆశీర్వదించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ షానూర్ బాబా, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ,ఖాజా ఫసియోద్దీన్, మైనారిటీ జర్నలిస్ట్ సిరీల్ హాజరయ్యారు.