రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: రాజ్యాంగం జోలికొస్తే ఊరుకునేది లేదని నియంత కేసీఆర్ కు తగిన బుద్ధి చెబుతామని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు హెచ్చరించారు.
ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు దర్గాయి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో రాజ్యాంగంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ భువనగిరి పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగం మన రాజ్యాంగం అని దాని ఫలితం వల్లనే భారతదేశం ప్రపంచ దేశాలకు దీటుగా ఎదిగిందని, దేశంలో సమానత్వం సార్వభౌమత్వం లౌకికవాదం ప్రజాస్వామ్యం రాజ్యాంగ స్ఫూర్తి లో భాగమని ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తూ చేసిన హామీలను దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంటికో ఉద్యోగం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, దళిత ముఖ్యమంత్రి లాంటి హామీలను ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల దృష్టి మళ్లించడానికి రాజ్యాంగం పై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా కెసిఆర్ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని అన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారయణ,వలిగొండ ఎంపీపీ నూతి రమేష్, సర్పంచ్ బోల్ల శ్రీను, కౌన్సిలర్స్ ఈరపాక నర్సింహ, పడిగెల ప్రదీప్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బర్రె నరేష్, అంగడి నాగరాజు,కొల్లూరు రాజు, ముచ్ఛాల మనోజ్, అందే నరేష్ ,కోట మహేందర్, బండారు బుచ్చి రాములు, దర్గాయి దేవేందర్,ఎండీ బురాన్, గరిసే రవి, డాకూరి ప్రకాష్,ఎండీ సలావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.