రాయల్ పోస్ట్ ప్రతినిధి: రామడుగు మండలం రంగశాయిపేట గ్రామానికి చెందిన కార్యదర్శి చిలుముల రమేష్ అందించిన సమాచారం ప్రకారం మేడిపల్లి మండలం, కల్వకోట గ్రామానికి చెందిన కునుమల్ల రాజేష్ గారు రోజు కూలి పనికి వెళ్తూ జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ప్రమాద వశాత్తు అతను పని చెస్తున్న స్థలంలో కాలు జారిపడిపోవడం తో వెన్నుముక దెబ్బతిని ఆరోగ్యం క్షీణించి మంచానికి పరిమితం అయ్యాడు అతనికి భార్య లహరి , ముగ్గురు పిల్లలు ఉన్నారు, భర్త అనారోగ్యంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా తయారయ్యింది అలాగే అతడికి మెరుగైన వైద్యం అందించలేక ప్రస్తుతానికి ఇంటి దగ్గరే నెలకు 45వేల రూపాయల ఖర్చుతో ఫిజియోతెరఫీ చేస్తున్నారు దాతలు ఎవరైనా సహాయం చేస్తే మెరుగైన వైద్యం అందిస్తామని కోరిన విషయం వారి బంధువులు కొల్లూరి నరేష్, ఎడ్ల లక్ష్మీనరసయ్య గార్లు దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి కార్యవర్గ సభ్యుడు గణేష్ పింజరి గారికి మరియు చిలుముల రమేష్ వివరించగా సేవాసమితి అధ్యక్షుడు అయిన రవి ఉట్నూరి కి విరరించగా, సామాజిక సేవకులు డా౹౹ఎల్లాల శ్రీనివాస్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి వారితో చర్చించి సేవాసమితి సభ్యులు అందరు కలిసి 25వేల ఆర్ధిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ రోజు దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి వ్యవస్థాపకులు మరియు నర్సిముహునిపేట సర్పంచ్ నెరువట్ల బాబుస్వామి గారు సేవాసమితి సభ్యులు పోచంపల్లి నర్సయ్య, గల్ఫ్ JAC కన్వీనర్ గుగ్గిల్ల రవి గౌడ్, మహేష్, బహుజన ఐక్యవేధిక అధ్యక్షులు ఎడ్ల లక్ష్మీనర్సయ్య, సర్పంచ్ అదే హన్మక్క, ఉప సర్పంచ్ బన్న రాజేందర్,మాజీ సర్పంచ్ అదే లక్ష్మీరాజం,ఎడ్ల వెంకటి, గాజీ పాషా మరియు (సాక్షి దినపత్రిక విలేకరి సురేష్ బండ్ల) మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సహాయం చేయడానికి ముందుకు వచ్చిన దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి సభ్యులకు మరియు సహకారం అందించింన సేవా సమితి సభ్యుడు గణేష్ పింజరి మిత్రబృందానికి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్థులు కృజ్ఞతలు తెలియజేశారు.