రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి; యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ ఎంప్లాయిస్ యూనియన్ గా భువనగిరి వైద్య శాఖలో పనిచేస్తున్న
అహ్మద్ జమాల్ షరీఫ్
ఫారూఖి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ఏ ఏ ఖాన్ తెలిపారు.

భువనగిరి పట్టణంలోని స్థానిక ఏ ఏం ఆర్ షాదిఖానాలో శుక్రవారం తెలంగాణ మైనారిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది.ఎన్నికల అధికారిగా నల్లగొండ నుండి డాక్టర్
ఏ ఏ ఖాన్ ఎన్నికల అధికారిగా పాల్గొనడం జరిగింది ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా మైనారిటీ ఎంప్లాయిస్ వర్కింగ్ అధ్యక్షులు గా అహ్మద్ జమాల్ షరీఫ్ ఫరూఖి ఎన్నికనైట్లు ఎన్నికల అధికారి ఏ ఏ ఖాన్ తెలిపారు.ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మైనారిటీ ఎంప్లాయిస్ యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మైనారిటీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు అయినా ఎండీ ఫారూఖ్ గారి సహకారంతో పరిష్కరిస్తానని అన్నారు. అలాగే ఎంప్లాయిస్ కి ఎటువంటి సమస్యలు ఉన్న నేరుగా తన దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తానని ఎల్లవేళలా ఉద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.