రాయల్ పోస్ట్ ప్రతినిధి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఉన్నత చదువులకు ప్రభుత్వం అందించేటువంటి స్కాలర్షిప్లు,ఫీజు రియాంబర్స్ మెంటు గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం సకాలంలో విడుదల చేయకపోవడంతో స్కాలర్షిప్ల పైన ఆధారపడి చదివే విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇంటర్మీడియట్, డిగ్రీ చదువులు పూర్తయ్యే దశకు వచ్చే సరికి కూడా విద్యార్థులకు అందించే స్కాలర్షిప్ లు సంవత్సరాలు గడిచిన రాకపోవడంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లలేక మధ్యలో ఉన్న చదువును ఆపేసి డ్రాపౌట్ గా మారుతున్నారని తెలిపారు.ఇది ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు ప్రభుత్వం ఒకటి నిర్ణయిస్తే , ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష ఫీజుల పేరుతో అధికంగా విద్యార్థుల నుండి ఫీజులు వసూలు చేస్తున్నారన్నారు.ఈ ఫీజులు చెల్లించిన విద్యార్థులకు ప్రైవేట్ జూనియర్ కళాశాలల యాజమాన్యలు ఎలాంటి రసీదులు కూడా ఇవ్వడం లేదని, ఇప్పటికైనా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు పరీక్ష ఫీజుల పేరు తో విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలల పై చర్యలు తీసుకోగలరని కోరారు. లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు నరేంద్ర, మహేష్, సాయి, పవన్, మహేష్ పాల్గొన్నారు.