రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సమావేశంలో రాజ్యాంగం మార్చాలి అన్న వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు నాగరిగారి ప్రీతం ఆదేశాల మేరకు భువనగిరి జిల్లా అధ్యక్షుడు దర్గాయి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న పీసీసీ కార్యదర్శి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నక్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎమ్మెల్యే గా, ఎంపీగా, కేంద్ర, రాష్త్ర మంత్రి గా ఆర్టికల్ 3 ద్వారా ఏర్పడిన తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న కెసిఆర్ రాజ్యాంగాన్ని మార్చాలన్న వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని,1973 లోనే కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు భారత రాజ్యాంగానికి సంబంధించి స్పష్టమైన తీర్పు ఇచ్చిందని రాజ్యాంగ ఆత్మను రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే హక్కు పార్లమెంటుకు కూడా లేదని ఈ విషయంపై మాట్లాడడానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు కనీస అర్హత కూడా లేదని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై దేశద్రోహ కేసు నమోదు చేయాలని పదవులను బర్తరఫ్ చేయాలని అన్నారు.రాజ్యాంగ వ్యతిరేక శక్తుల పట్ల కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా ఉంటుందని ఎప్పటికప్పుడు వారి మోసాలను ఎండగడుతూ రాజ్యాంగ రక్షణ కోసం అంబేద్కర్ గారి ఆలోచనా విధానం అమలుకోసం పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కైరం కొండ వెంకటేష్, ఈరపాక నరసింహ, పడిగెల ప్రదీప్,ఎండీ సలావుద్దీన్, ఎంపిటిసి పాశం శివానంద్, కాంగ్రెస్ నాయకులు ముచ్చాల మనోజ్ యాదవ్, కొల్లూరి రాజు, దాసరి మధు, దర్గాయి దేవేందర్, మచ్చ నరసింహ, డాకురి ప్రకాష్, ఎనగండ్ల సుధాకర్, సాల్వెరు ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.
మౌన దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు రావుల రాజు సంఘీభావం తెలపడం జరిగింది.