రాయల్ పోస్ట్ ప్రతినిధి మంచిర్యాల: రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.ఐపీఎస్ (డీఐజీ) గారి ఆదేశాలమేరకు నిన్న అర్ధ రాత్రి సమయం లో టాస్క్ ఫోర్సు సిఐ ఏ.మహేందర్ ఆధ్వర్యంలోనీ టాస్క్ ఫోర్సు పోలీసులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ GM ఆఫీస్ చౌరస్తాలో అనుమానాస్పదంగా వెళుతున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేసి, అక్రమంగా మహారాష్ట్ర కి తరలిస్తున్న 10 క్వింటాళ్ల పిడిఎస్ రైస్ ను , వాటిని సరఫరా చేసే AP01 TV 0076 నంబర్ గల టాటా ఏస్ ఆటో ను స్వాధీన పరుచుకొని నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది .

అరెస్ట్ చేసిన నిందితుడి వివరములు:

  1. G. నరేష్ , తండ్రి: రాములు , 23 సo:లు, గ్రామం: తిలకనగర్, మంచిర్యాల .

స్వాధీ పరుచుకున్న వాటి వివరములు :

పిడిఎస్ రైస్ 10క్వింటాళ్ళు వాటి విలువ సుమారు రూపాయలు 20,000=00,
ఒక టాటా ఎస్ ఆటో మరియు
పట్టుబడిన నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ వారికీ అప్పగించడం జరిగింది.

ఈ టాస్క్ లో రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ ఏ.మహేందర్ గారితో పాటు టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న లు మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది
సంపత్ కుమార్,భాస్కర్ గౌడ్ లు పాల్గొన్నారు.