రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమా సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి డివిజన్ ఆఫీస్ ప్రాంగణంలో ఉద్యోగ పదోన్నతులో రిజర్వేషన్లు ఎత్తివేసే కుట్ర యజమాన్యం ఇచ్చిన T.G.O.O 62 రద్దు చేయాలని నల్ల బ్యాడ్జి ఫ్లకార్డుతో నిరసన తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కుసంగి శ్రీనివాస్ , బోట్లా రాజేశ్వర్ మాట్లాడుతు భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బహుజన సమాజాన్ని వెనకబడిన వర్గంను దృష్టిలో పేట్టుకోని ముందుచూపుతో ఆనాడే రిజర్వేషన్ హక్కులను కల్పించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మరియు విద్యుత్ యజమాన్యం ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మహిళా ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు తొలగిస్తూ ఇచ్చిన T.G.O.O 62 ను రద్దు చేయాలని కోరడం జరిగింది. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం పదోన్నతోలో రిజర్వేషన్ రాష్ట్రాలకు అప్పజెప్పడం జరిగింది అయినా రాష్ట్ర ప్రభుత్వం,విద్యుత్ యజమాన్యం కుట్రపన్ని T.G.O.O 62 ను ఇవ్వడం జరిగింది. వెంటనే మెరిట్ కమ్ సీనియార్టీ ని రద్దు చేసి పాత పద్ధతిలోనే ఆర్ఓఆర్ ప్రకారం ఉద్యోగ పదోన్నతుల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని అదే విదంగా అంభేద్కర్ స్పూర్తి భవన్ ను కులగోట్టే కుట్రను జరిగితే అంభేద్కర్ నే అవమానించినట్టే…అ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తిసుకోవాలని లేనిపక్షంలో యజమాన్యానికి వ్యతిరేకంగా బహుజన ఉద్యోగులతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి పోరాట నిర్మాణాన్ని చేపడతామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో భువనగిరి డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు జైపాల్ యాదగిరి ,327 డివిజన్ కార్యదర్శి నర్సింగ్ రావు ,హెచ్ 52 యూనియన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్ ,చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు బోయ మల్లేష్ ,జిల్లా అదనపు కార్యదర్శి MR రవీందర్,జిల్లా కోశాధికారి సగ్గు హరినాథ్ , టెక్నికల్ AE రాజు ,సబ్ డివిజన్ లీడర్లు జానాకిరాములు,పోట్ట మహేష్ , సెక్షన్ లీడర్లు లింగస్వామి, నర్సింగ్ రావు ,బిక్కు నాయక్,మహేష్ తదితరులు పాల్గోన్నారు…