రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: సంగారెడ్డి జిల్లా మారేపల్లి లో బెల్టు షాపులకు వ్యతిరేకంగా పోరాడిన దళితుల పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించిన పోలీసులు ఈ విషయంపై బాధితుల కుటుంబాలను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నగర్ గారి ప్రీతం , కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, ముత్తినేని వీరయ్య తో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ విభాగం చైర్మన్ పత్తి కుమార్ కలిసి ఈ రోజు మారేపల్లి లో పర్యటించడం జరిగింది పూర్తిగా అవాస్తవమైన కేసులను పెట్టి దళితులను జైలుకు పంపించిన సంబంధిత పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని బెల్టుషాపు నిర్వాహకులపై కేసులు పెట్టాలని హెచ్చరించడం జరిగింది లేనిపక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో జరిగింది ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా చైర్మన్ రమేష్ బాబు ప్రమోద్ రాజ్ కుమార్ ముకేOదరు మధుమోహను రాజేశ్వర్ జావెద్అలి వెంకటేష్ కళ్యాణ్ జీవన్ తదితరులు పాల్గొన్నారు