రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని తన నివాస గృహంలో రాజపేట మండలం రఘునాథ పురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు గతంలో క్రీడా సామాగ్రి కోసం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ బిర్లా ఐలయ్య సంప్రదించగా, తక్షణమే స్పందించి వారికి బిర్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా సామగ్రిని అందజేయడం జరిగింది .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించాలని క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెంపొందుతుందని అన్నారు.
ఆలేరు నియోజకవర్గ యువత అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. వారికి సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ బీర్ల ఫౌండేషన్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు కలకుంట్ల రాజు, సందీప్, బాల కృష్ణ ,నవీన్, క్రాంతి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.