రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: 26 వ వార్డు ప్రజలపై వివక్ష చూపుతున్న చైర్మన్ అభివృద్ధిపై అన్ని వాళ్లకు 6 నుండి ఆరు లక్షల 70 వేల రూపాయలు కేటాయించి 26 వ వార్డు కు కోత విధించడం పై కౌన్సిలర్ ఈరపాక నరసింహ పాలక పక్షాన్ని నిలదీత
14వ ఆర్థిక సంఘం నిధులతో ద్వారా పురపాలక సంఘం లోని 35 వార్డులకు అభివృద్ధి పనుల నిమిత్తం ఒక్కో వార్డుకు 6: 50నుండి ఆరు లక్షల తొంభై రూపాయలు కేటాయించి 26 వ వార్డు కు అభివృద్ధి నిమిత్తం 4.20 వెయిల రూపాయలను తక్కువ కేటాయించడంపై నేడు జరిగిన కౌన్సిల్ సమావేశంలో అధికార టీఆర్ఎస్ పాలక పక్షంపై 26 వార్డ్ కౌన్సిలర్ నరసింహ మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరిట 35 వార్డులకు ఆరు లక్షల నుండి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు కేటాయించి 26 వ వార్డు కు తక్కువ కేటాయించడంపై నిరసన వ్యక్తం చేస్తూ అధికార టీఆర్ఎస్ పాలక పక్షంపై మండిపడ్డారు ఎందుకు 26 వ వార్డు పైన వివక్ష చూపుతున్నారని తక్షణమే అందరితో సమానంగా అభివృద్ధి నిధులను కేటాయించాలని లేనిపక్షంలో వార్డు ప్రజల సహకారంతో చైర్మన్ ఇంటిముందు లేదా కార్యాలయం ముందు నిరాహార దీక్ష చేసి నిరసన తెలుపుతామని ఈ సందర్భంగా తెలియజేయగా చైర్మన్ ఆంజనేయులు మరియు కమిషనర్ గారు కచ్చితంగా అభివృద్ధిలో అందరితో సమానంగా చూస్తామని కేటాయించడంలో తప్పు జరిగిందని తగ్గించి నటువంటి అమౌంట్ తక్షణమే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు అని తెలిపారు.