రాయల్ పోస్ట్ ప్రతినిధి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ప్రముఖ సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ నెల 18 న రైతన్న సినిమా విడుదల సందర్భంగా మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చానని అయన తెలిపారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న కరోన కష్టకాలంలో అందరం ఇంట్లో ఉంటే రైతు మాత్రం పంటలు పడించి దేశానికి భరోసా నిలిచిన రైతులకు అన్యాయం చేయడానికి తీసుకు వచ్చిన నల్ల చట్టాలను సవరించి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలలో ఇంగ్లీషు విద్యా తీసుకురావడం చాలా గర్వించదగా విషయమని, మాన మాతృభాష తెలుగని, ఇప్పుడు ఉన్న సమాజంలో తెలుగు భాషతో పాటు ఇంగ్లీషు నేర్చుకుంటే చాలామంది విద్యార్థులు అన్ని రకాలుగా ఉద్యోగాలు సాధించడానికి ఉత్సాహవంతులుగా ఉంటారని అయన అన్నారు.