రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /సోమవారం నుండి ప్రారంభమయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో దేశ ప్రజల ఆరోగ్య సేవలకు ప్రాధాన్యమివ్వాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ యాదాద్రి భువనగరి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అతహర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం అతహర్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజలకు కావలసిన ముఖమైన సేవలలో ఆరోగ్య సేవలు అత్యంత ప్రాధాన్యమైనవని అలాంటి సేవలను ప్రజలకు మారింత చౌకగా అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపారు.ముఖ్యంగా కరోనా విపత్కర సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న వాటిపై జీఎస్టీ ని తగ్గించాలని అన్ని వస్తువులు వెంటిలేటర్లు 12% ,మాస్క్ 5% ,హ్యాండ్ సానిటైజర్ 18% ,పీపీఈ కిట్ 5% ,కరోనా టెస్ట్ కిట్లు 12% ఈ విదంగా ఉన్న వాటిపై జీఎస్టీ శాతం అన్ని ఒకే పరిధి లోకి తెచ్చి 5 శాతానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు .అందులో ప్రధానంగా హాండ్ సానిటైజర్లపై అత్యదిక జీఎస్టీ 18% వసూలు చేస్తున్నారని దానిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎందుకనగా హ్యాండ్ సానిటైజర్ మనిషి దినచర్యలో ఒక భాగంగా మారిపోయిందని అలాంటి దానిపై అధిక పన్ను వసూలు చేసి ప్రజల పై భారాన్ని మోపడం సబబు కాదన్నారు.ఇంతకు ముందు ఆక్సిజన్ సిలిండేర్ పై కూడా 12 శాతం జీఎస్టి ఉండేదని తరవాత దానిని 5 శాతానికి తగ్గించ్చారని అదేవిధంగా అన్ని అత్యవసర వస్తువులపై జీఎస్టి తగ్గించాలన్నారు .అందువలన ప్రజలకు మేలుచేసే విధంగా ప్రభుత్వాలు పనిచేయాలని తెలిపారు.ప్రస్తుత సమయంలో ప్రజలందరూ కరోనా మహమ్మారిని ప్రాలదోలి సంపూర్ణ ఆరోగ్య భారత దేశాన్ని చూడాలని కోరుకుంటుంన్నారని దానిని నెరవేర్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై కూడా ఉంటుందని గుర్తుచేశారు.