• టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున.
  • రాయల్ పోస్ట్ న్యూస్ నల్గొండ: స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఉన్న ఆర్ అండ్ బి అతిథి గృహంలో టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో టిఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత, విద్యార్థుల కోసం అనేక విద్య అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే ప్రభుత్వ రంగంలో అనేక సంస్థల ద్వారా 132000 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా మరో 60 , 70 వేల ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు . కాబట్టి నిరుద్యోగుల ముసుగులో ప్రతిపక్ష పార్టీల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, బిజెపి పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లుగా సీఎం కేసీఆర్ గారిని, తెలంగాణ ప్రభుత్వం పై అసత్య ఆరోపణలు చేస్తూ తన రాజకీయ లబ్దికోసం నిరుద్యోగులను వాడుకుంటున్నారని హెచ్చరించారు వారు ఎన్ని మాటలు చెప్పినా నిరుద్యోగ యువత, విద్యార్థులు సీఎం కేసీఆర్ గారి వెంటే ఉంటారని స్పష్టం చేశారు అదే విధంగా నిరుద్యోగ యువత కోసం అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో స్థాపించి ఇప్పటివరకు దాదాపు 12 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారన్నారు కావున నిరుద్యోగ యువత గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్వి నాయకులు పగిళ్ల మణి, బి నరేష్ రెడ్డి, సిహెచ్ శివ కుమార్, వెంకన్న, శంకర్ ,లింగస్వామి, కళ్యాణ్, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు