గుండాల జనవరి31(రాయల్ పోస్ట్ న్యూస్): సోమవారం గుండాల మండల తాసిల్దార్ శ్రీనివాసరాజు కు సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ సభ్యులు మద్దెపురం రాజు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరం కాలం అయిపోయినప్పటికి ధరణి పోస్టుల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించలేక పోతున్నదని దాని వల్ల రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని ధరణి వెబ్సైట్ లో అనేక తప్పులు ఉండడం వలన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రైతులకు చేరటంలేదనిఅన్నారు. ఈ కార్యక్రమంలో యండి ఖలిల్ దార సతీష్ తదితరులు పాల్గొన్నారు.