గుండాల జనవరి31(రాయల్ పోస్ట్ న్యూస్):గుండాల మండల పరిధిలోని మరిపడిగా గ్రామంలో సిపిఐ మండల శాఖ ఆధ్వర్యంలో చాంద్ పాషా ఏడవ వర్ధంతి సభను నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి కమిటీ సభ్యులు ఆది సాయన్న మాట్లాడుతూ చాంద్ పాషా సిపిఐ పార్టీకి చేసినటువంటి సేవలను కొనియాడుతూ సిపిఐ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజా సమస్యలపై పరిష్కారానికి సిపిఐ పార్టీ ఎల్లవేళల ప్రజలకు అండగా ఉంటుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనంతల రామచంద్రు,మండల సిపిఐ సహాయ కార్యదర్శి నర్రాముల సోమన్న,కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గూడెపు వెంకన్న,మండల కార్యవర్గ సభ్యులు బోయిని బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.