రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ /గెలుపు ఓటములను సమాన దృష్టితో చూస్తూ క్రీడాకారులు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మరియు బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అయిలయ్య అన్నారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం లోని గుండ్ల గూడెం గ్రామంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు ఆయన బహుమతులను అందజేసిన అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం క్రీడాకారులకు సరైన సదుపాయాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తోందని ధ్వజమెత్తారు. నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇండోర్ మరియు అవుట్ డోర్ క్రీడా మైదానాలు నిర్మిస్తున్నట్లు గొప్పగా చెప్పిన పాలకులు నేటి వరకు దానిని పూర్తి చేయకుండా ఎందుకు ఉంటున్నారు అని నిలదీశారు. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది క్రీడాకారులు ఎంతో నైపుణ్యం కలిగి ఉండి సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో క్రీడా మైదానాల ను ఏర్పాటు చేసి ఇ క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు దూసరి మురళి అధ్యక్షతన జరుగాగా ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొండ్రాజ్ వెంకటేశ్వర రాజు. ఆలేరు పట్టణ అధ్యక్షులు ఎంఎ ఏజాజ్. దూసరి అంజయ్య. కర్రె అజయ్. పర్రె రమేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు…