రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణము లో ” ఇండియన్ మెడికల్ అసోసియేషన్”(IMA) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా డాక్టర్ విజయ్ భార్గవ్ ఎన్నికైన సందర్భంగా తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మర్యాదపూర్వకంగా కలిసి ,శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముహమ్మద్ ఖాజా పసివుద్దీన్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, పట్టణ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు షేక్.రషీద్ ప్రచార కార్యదర్శి భైరపాక సీరిల్ తదితరులు పాల్గొన్నారు.