గుండాల జనవరి30(రాయల్ పోస్ట్ న్యూస్): గుండాల మండల పరిధిలోని తుర్కలశాపురం నుండి వయా బంజారబావి మీదిగా బండకొత్తపల్లి వెళ్లే దారిలో నిత్యం అనేక మంది ప్రయాణిస్తుంటారు.ఈ దారి మీదగా బిక్కేరు వాగు ఉండటం వలన కొద్దిపాటి వర్షాలకు వెళ్లడానికి ఇబ్బందిగా మారుతుంది తుర్కలషాపురం ఊర చెరువు అలుగు పోసిన అప్పటి నుండి అలుగు తక్కువ అయ్యేవరకు రాకపోకలకు ఇబ్బందిగా మారుతుంది.ఈ వాగు అవతల వైపు సుమారు రెండు వందల కుటుంబాలకు సంబంధించిన వ్యవసాయ భూములు అక్కడ ఉండడం వలన రైతులు అలుగు పోస్తున్న సమయంలో నానా ఇబ్బందులు పడుతున్నారు,వ్యవసాయ బావుల దగ్గరకు వెళ్ళడానికి దాదాపుగా 15 కి.మీ.తిరిగి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది,కావున రైతులను దృష్టిలో ఉంచుకోని బ్రిడ్జి నిర్మించాలని పిఎసిఎస్ వైస్ చైర్మన్ పురుగుల యాదలక్ష్మీమల్లేష్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీతమహేందర్ రెడ్డికి మరియు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఆమె వెంట మాజీ ఎంపిటిసి జక్కుల రాములు,లింగస్వామి,నర్రముల సోమన్న,కె.లింగయ్య, స్వామి తదితరులు పాల్గొన్నారు.