లేదంటే ఎక్సైజ్ కార్యాలయం ముట్టడిస్తాం

మారేపల్లి ఘటనపై జిల్లా ఉన్నత అధికారులతో విచారణ జరపాలి

బెల్టు షాపుల నిర్వహణ కు వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేయాలి


ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న మద్యం బెల్ట్ షాపులను నిషేధించాలని లేదంటే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు
ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలో బెల్టుషాపుల వల్ల తాగుడుకు బానిసలై ఐదు మంది చనిపోయే ఉన్నారని అన్నారు మూడు వేల జనాభా గల గ్రామం లో ఆరు బెల్టుషాపులు నడుపుతున్నారు అంటే మద్యం మత్తు ఏరకంగా ప్రజలను పీక తింటుందో అర్థమవుతుందని అన్నారు అయినా మైకంలో భార్య పిల్లలు తల్లిదండ్రులను కూడ సరిగా చూడటం లేదు, తాగడానికి డబ్బులు ఇవ్వకపోతే కుటుంబల్లో గొడవలు జరిగి ఆత్మహత్యలు చనిపోవడం జరుగుతుంది యధేచ్చగా బెల్టు షాపులు నడుస్తున్న ఎక్సైజ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాప్ లో వాటాదార్లుగా ఉండి నడుపుతున్నారు కాబట్టే బెల్టు షాపులపై ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు మారేపల్లి గ్రామం లో మూడు నెలల్లోనే తాగుడుకు బానిసై 1.సి.మాణిక్యం 2.సి. అశోక్ 3. మీసాల నర్సింలు 4. మీసాల నవీన్ 5. మహబూబ్ బాషా ఐదుగురు చనిపోయారు అన్నారు మా కుటుంబాలు వీధిన పడుతున్నాయని మహిళలు బెల్టుషాపులు రద్దు చేయాలని అడగడానికి బెల్టుషాపుల దగ్గరికి వెళ్ళినారు మహిళలపై నా మహిళలకు మద్దతు తెలిపిన మగవాళ్ళ పైన 19 మంది దళితులపైన నాన్బెయిలబుల్ కేసులు పెట్టారు ఇది చాలా దుర్మార్గమని అన్నారు 13 మంది జైల్లో ఉన్నారు. బెల్టు షాపు నడుపుతున్న వారిని వదిలి,బెల్టుషాపులు వద్దు అన్న వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు బంగారు తెలంగాణ, దళిత బంద్ తో దళితుల అభివృద్ధి అని చెబుతున్న ప్రభుత్వం దళితులు ప్రాణాలు పోతున్న బెల్టుషాపులను రద్దు చేయడం లేదు దళితుల మీద అక్రమంగా నాన్బెయిలబుల్ కేసులు పెడితే పట్టించుకోవడం లేదు ఇదేనా దళితుల సంక్షేమం అభివృద్ధి ప్రభుత్వం వెంటనే స్పందించి బెల్టుషాపులు నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలిని,బెల్టుషాపులు నడుపుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా వారికి వత్తాసు పలుకుతున్న ఎక్సైజ్ అధికారులను సస్పెండ్ చేయాలి,మారేపల్లి దళితుల మీద పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి, జైల్లో ఉన్న దళితులు బేషరతుగా విడుదల చేయాలని, బెల్టు షాపుల వల్ల తాగి చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కెవిపిఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు ప్రభుత్వం స్పందించకపోతే ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు
ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,న్యాయవాది సుభాష్, జిల్లా కమిటీ సభ్యులు ప్రవీణ్, దత్తు పిఎన్ఎం జిల్లా కార్యదర్శి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు