గుండాల జనవరి30(రాయల్ పోస్ట్ న్యూస్): ఆదివారం గుండాల మండల పరిధిలోని కొమ్మాయిపల్లి గ్రామంలో జిడికల్,వెల్మ జాల, సీతారాంపురం,మాసన్ పల్లి, రామరం వరకు బిటి రోడ్ల నిర్మాణం కోసం గ్రామీణ సడక్ యోజన క్రింద ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గోంగిడి సునీతా మహేందర్ రెడ్డి,భువనగిరి ఎంపీ కోమటరెడ్డి వెంకట్ రెడ్డి లు బిటి రోడ్కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్దే ధ్యేయంగా పని చేయాలని భువనగిరి నియోజకవర్గ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ప్రతి నిరుపేదకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇచ్చే బాధ్యత పాలకుల పై ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.జిల్లాలో మారుమూల ప్రాంతమైన గుండాల మండలం అభివృద్ధికి నోచుకోక పోవడం బాధాకరం అని ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాల మధ్యన లింకు రోడ్లు లేకపోవడం దీనికి తోడు నల్లగొండ జిల్లాలో వున్న గుండాల ను జనగామ జిల్లాలో కలపడం వలన ఈ మండల అభివృధి ఆగిపోయిందని నేటికీ కూడా పోలీస్ వ్యవస్థ వరంగల్ జిల్లా నుండే కొనసాగుతుందని అన్నారు.నవాబ్ పేట రిజర్వాయర్ నుండి గుండాల మండలానికి రావలసిన తాగు నీటిని వరంగల్ పాలకుర్తి ఏరియా కు తరలించు పోతున్నారని అన్నారు.దళిత కుటుంబాలకు ఇచ్చిన ఇళ్లను డ్రా పద్ధతిన ఎంపిక చేసి ఇల్లు నిర్మించాలని అన్నారు. మండలం లో ప్రతి గ్రామానికి ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా నిధులు మంజూరు కోసం కృషి చేస్తానని అన్నారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గుండాల మండలం అభివృద్ధికి దూరంగా ఉన్న మాట వాస్తవమే అని ఆలేరు నియోజక వర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అడిగిందే తడువుగా కోట్లాది రూపాయలు వెచ్చించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని అన్నారు. ఆలేరు నియోజక వర్గంలో దళిత బంధు అమలులో భాగంగా రెండు గ్రామాలను ఎంపిక చేసుకొని ప్రతి దళిత కుటుంబానికి అంచెల వారీగా అందించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ లకు గురుకుల పాఠశాల ద్వారా విద్యను అందిస్తూ ఉన్నత చదువులు చదివే వారికి ఒక్కో విద్యార్థికి 25 లక్షల వరకు విదేశీ విద్య కోసం ఖర్చు చేస్తున్నామని అన్నారు. గుండాల మండలంలో ప్రతి గ్రామానికి నవాబ్ పేట రిజర్వాయర్ నుండి గోదావరి నది జలాల ద్వారా అన్ని కుంటలు చెరువులు నింపామని రైతులు సహకరిస్తే మళ్ళీ గొలుసు కలువల ద్వారా నీరు వృధా అవ్వకుండా నింపుతమని అన్నారు. గుండాల మండలంలో ఉన్న బిక్కేరు వాగుపై ఇప్పటికే మూడు చెక్ డ్యాం ల పనులు నడుతున్నయని సుద్దాల, పల్లె పహాడ్ గ్రామాల మధ్యన బికేరు వాగూపై బ్రిడ్జ్ కోసం చెక్ డ్యాం పనులు పూర్తి చేసుకొని బ్రిడ్జి నిర్మాణం కోసం 11 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించమని అన్నారు. భువనగిరి ఎంపీ సహకరించి నట్లయితే ప్రతి నీరు పేదకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి, గ్రామ సర్పంచ్ మొసలి విజిత రమేష్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఎండీ ఖలీల్,పిఏసిఎస్ చైర్మన్ లింగాల బిక్షం,మాజీ జెడ్పీటీసీ మందాటి రామకృష్ణ రెడ్డి,ఎంపీటీసీ సంఘీ అలివేలు వెంకటాద్రి,మాజీ ఎంపీపీ ధ్యాప కృష్ణరెడ్డి,ఎంపిడిఓ శ్రీనివాస్, ఏఈ దామోదర్ తదితరులు పాల్గొన్నారు.