రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: దేశ రాజదాని డిల్లీ కస్తూర్బాలో యువతీపై సామూహిక అత్యాచార ఘటనలో బాద్యులైన ఉన్మాదులను కఠినంగా శిక్షించాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ అన్నారు. డిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ఐద్వా ఆద్వర్యంలో భువనగిరి పట్టణంలో నిరసన కార్యక్రమం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 73 ఏండ్ల ప్రజాస్వామిక భారతంలో ఇలాంటి ఉన్మాద ఘటనలు పునరావృతం అవుతుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయన్నారు. దేశ రాజదాని నడిబొడ్డున గుండు గీయించి తోటి మహిళలే అత్యాచారానికి పురిగొల్పడం హేయమైన చర్య అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాద్యులను కఠినంగా శిక్షించి యువతి కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. మద్యం,డ్రగ్స్,పోర్న్ సైట్స్ పై కఠినంగా వ్యవహరించిలి.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాలను ఆచరణతో అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా భువనగిరి పట్టణ అద్యక్షురాలు కల్లూరి నాగమణి,బి.భావన,కే.పావని,కె.అనిత,బి.రమ్య,శభీనా,బి.జయశ్రీ,నజియా తదితరులు పాల్గొన్నారు.