రాయల్ పోస్ట్ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా, ఆత్మకూరు మండలం, కాల్వపల్లి గ్రామంలో విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది…
గ్రామంలోని ఆవుల అబ్బాస్, అఖిలకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు శ్రీవల్లి 3 సంవత్సరాలు, చిన్న కూతురు నిత్విక. చాల బీద పరిస్థితి లో అయినా తన ఇద్దరి కూతుర్లని మాత్రం అల్లారుముద్దుగా పెంచుకున్నారు. రోజువారీ. పనుల నిమిత్తం బావి దగ్గర తన తల్లిదండ్రులు పిల్లలు కలసి పోయారు. తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉండగా పెద్ద కూతురు కడుపేదరికంలో పుట్టిన అభం శుభం తెలియని ఆ చిన్నారి శ్రీవల్లి ఆడుతూ ఆడుతూ పాల అమృతం, పండ్ల రసాలు అనుకోనెమో పశువులకు వాడే ఆ పాపిష్టి గోమోర్ మందును తాగి కానరాని లోకాలకు వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు శ్రీవల్లి మరణంతో తట్టుకోలేక పోతున్నారు. పది నెలలు గర్భగుడిలో మోసి, 3 సంవత్సరాలు పెంచిన ఆ చిన్నారి శ్రీవల్లి ఇక లేదని మాట తన తల్లి తట్టుకోలేక పోతుంది. ఆ తల్లి ఏడుపును ఓదార్చలేని పరిస్థితి. శ్రీవల్లి మరణం గ్రామంలో విషాదకరమైన సంఘటన నెలకొంది….