రామగుండం పోలీస్ కమిషనరేట్

06 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్…

8,700/- రూపాయల నగదు,06 సెల్ ఫోన్ లు స్వాధీనం

రామగుండము పోలీస్ కమీషనర్ శ్రీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి.ఐపీఎస్ గారి ఆదేశాలమేరకు ఈరోజు టాస్క్ ఫోర్సు సిఐ ఏకే.మహేందర్ ఆధ్వర్యంలో మంచిర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ నగర్ గోడౌన్ పరిసరాలలో డబ్బులు పందెంగా పెట్టుకుని పేకాట ఆడుతున్నారు అనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ మహేందర్, ఎస్ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించి అక్కడ పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 8700/- రూపాయల నగదు, 06 సెల్ ఫోన్ లు,పేకాట ముక్కలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న వీరిని తదుపరి విచారణ నిమిత్తం మంచిర్యాల పోలీస్ స్టేషన్ వారికి అప్పగించడం జరిగింది.

పట్టుబడిన వారి వివరాలు

1) బుర్ర మహేందర్ s/o పకీర్,
36 yrs, r/o. మందమర్రి.

2). మంత్రి వెంకటేష్ s/o పోచయ్య, 35 yrs r/o రామకృష్ణాపూర్.

3) రాచకొండ చంద్రయ్య s/o
వెంకటి, 42yrs r/o తాళ్లపల్లి

4) సప్ప స్వామి s/o రామయ్య 40 yrs, r/o గాంధి నగర్, మంచిర్యాల.

5) చిట్టవేని పోషం s/o గట్టయ్య,
40 yrs r/o అమరావది.

6) గజ్జెల నరేష్ s/o చంద్రయ్య,
29 yrs r/o గోపాల్ వాడ,
మంచిర్యాల.

ఈ సందర్భంగా సీఐ ఏకే మహేందర్ గారు మాట్లాడుతూ…… తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనే అత్యాశకు పోయి చాలా మంది పేకాటకు బానిసలుగా మారుతున్నారు అని అప్పుల పాలవుతున్న కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. పేకాట ఆడుతూ పట్టుబడిన వారు, వారి ప్రవర్తన మార్చుకో నట్లయితే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ టాస్క్ లో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న, టాస్క్ ఫోర్స్ సిబ్బంది,సంపత్ కుమార్,భాస్కర్ గౌడ్ లు
పాల్గొన్నారు.