రాయల్ పోస్ట్ తెలుగు దిన పత్రిక ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో స్వర్గీయ సామల శివ కుమార్ స్మారక క్రికెట్ పోటీలను స్థానిక మాసుకుంటా అరోరా కాలేజ్ మైదానంలో సామల ధర్మరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు .
క్రికెట్ పోటీల విజేతలకు నగదు పురస్కారాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరై స్వర్గీయ సామల శివకుమార్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. క్రికెట్ విజేతలకు ప్రథమా బహుమతిగా 15000/రూపాయలు భువనగిరి (తాత నగర్ ) ద్వితీయ బహుమతి గా యాదగిరిపల్లి 10000/రూపాయలు, తృతీయ బహుమతి గా 1000 రూపాలు చొప్పున గెలుపొందిన జట్టుకు నగదు తో పాటు షీల్డ్ అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామల శివ కుమార్ స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న సభ్యులను అభినందించారు. క్రీడలతో మానసిక శారీరక ఉల్లాసానికి దోహద పడతాయని అన్నారు. ప్రభుత్వం క్రీడాకారులకు జిల్లా కేంద్రంలో స్టేడియం నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు .క్రికెట్ పోటీలలో జిల్లాస్థాయి క్రీడాకారులు పాల్గొని ఎంతో ఉత్కంఠగా పోటీపడి ప్రధాన బహుమతులు పొందిన వారిని అభినందించారు. జాతీయస్థాయిలో యాదాద్రి జిల్లా క్రీడాకారులు గుర్తింపు తీసుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిసిసి మాజీ కార్యదర్శి తంగళ్ళపల్లి రవి కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పోత్నక్ ప్రమోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, కౌన్సిలర్ ఈరపాక నరసింహ,పడిగెల రేణుకా ప్రదీప్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బీసుకుంట్ల సత్యనారాయణ, మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్. బబ్లు ,అంగడి నాగరాజు. పోకల యాదగిరి.వైష్ణవి.ఇందిరవాలి బొమయ్యా. నీలా సుధాకర్. శ్రీశైలం. సామల గాంధీ. లింగాల బాలరాజ్ . విజయ్ కుమార్
ఇమ్మడి జహంగీర్. అశోక్.తదితరులు పాల్గున్నారు.