రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: భువనగిరి పట్టణ 23వ వార్డు ఇందిరా నగర్ లో అరుంధతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రచించిన దాని భారత దేశంలో రాజ్యాంగానికి ఆమోదం పొంది అమలైన దినోత్సవంగా గణతంత్ర దినోత్సవ జరుపుకుంటాం భారత రాజ్యాంగం మన దేశానికి వెన్నెముక మంచిచెడులను తెలిపే దేశాన్ని సరైన దారిలో నడిపించేదే మన భారత రాజ్యాంగం, మన న్యాయ వ్యవస్థ తో ఊపిరి లాంటిది మన రాజ్యాంగం 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమలు అయిన తర్వాత ప్రతి దేశ పౌరునికి స్వేచ్ఛని మాట్లాడే హక్కు ను ప్రశ్నించే హక్కును అందరితో సమానంగా జీవించే హక్కును అందరితో సమానంగా చదువుకునే హక్కును కల్పించింది మన రాజ్యాంగం కానీ నేటి పాలకులు భారత రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు దళితులను అణచివేత దిశగా ప్రభుత్వాలు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మన హక్కులను కాలరాస్తున్నారు ఇప్పటికైనా నిమ్న జాతుల వారందరం కలిసి ఏకతాటిపై ఉండి మన రాజ్యాంగాన్ని మనమే కాపాడుకునే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ బండారు రవివర్ధన్ పెరుమండ్ల ధరణి కుమార్ చిలివేరు రమేష్ సిరిపంగ శివలింగం యూత్ సభ్యులు కొల్లూరి రాజు ఈశ్వర్ బాబు నర్సింగరావు మహేందర్ దండు నరేష్ భరత్ సాయి రాజు శ్రవణ్ బాబి నరేష్ ప్రభాకర్ మల్లేష్ వెంకటేష్ మహేష్ రాజేష్ దేవేందర్ మహేష్ కిరణ్ తరుణ్ దినేష్ తదితరులు పాల్గొనడం జరిగింది.