రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి: ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజలు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగ జరుపుకుంటుంటే యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మాత్రం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటం పెట్టకుండ జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు అవమానించారని అందుకు భాద్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని దానికి జిల్లా కలెక్టర్ పూర్తి బాధ్యత వహించాలని భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ బర్రె జహంగీర్ డిమాండ్ చేశారు.
సమాచారం తెలుసుకున్న దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా బర్రె జహంగీర్, బట్టు రామచంద్రయ్య, బండారు రవివర్ధన్, లు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చినరోజే రాజ్యాంగ నిర్మాతను అవమానించడం, జిల్లాలో రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనే ఈసంఘటన జరగటం పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేక చర్యగా భావిస్తున్నామన్నారు.
సంఘటనకు సంబంధించి కలెక్టర్ తో మాట్లాడదామని ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్చాఫ్ గా ఉండటం విచారకరమని ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సమాచారం తెలుసుకొని స్పందించాల్సిన అధికారి ఫోన్ స్విచ్చాఫ్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.
ఏదేమైనా భాద్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర ఉన్నతాధికారులకు పిర్యాదు చేస్తామని దాంతోపాటు ఈసంఘటనపై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు
అనంతరం అదే స్థలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పెట్టి పాలాభిషేకం చేసి నినదించారు.
మరియు కలెక్టర్ కార్యాలయం ముందు రోడ్డుపై భైఠాయించి శాంతియుతంగా రాస్తారోకో నిర్వహించారు.
ఈకార్యక్రమంలో కౌన్సిలర్ ఈరపాక నర్సింహ, దళిత ప్రజా సంఘాల నాయకులు పడిగెల ప్రదీప్, సిర్పంగా శివలింగం ఇటుకల దేవేందర్, అన్నంపట్ల కృష్ణ, దండు నరేష్, కోడారి వెంకటేష్ ఎర్ర మహేష్ ,కకునూరి మహేందర్, ఈరపాక గిరి,గుండె వంశీ, సందేల రాజేష్ ముత్యాల లింగస్వామి పల్లెపటి రాజలింగం పల్లెపటి నర్సింగ్ ఎర్ర శంకర్ బొట్టు హరి కూరేళ్ల దర్శన్ అడెపు శివ తటికాయల బాబ్ల్యూ నగరం చింటూ పల్లెపటి శివ ఎర్ర శివ కొంగల వంశీ పొట్ట సాయి తదితరులు పాల్గొన్నారు.