రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ కలెక్టరేట్ / భారత గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 26వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో జాతీయ పతాకావిష్కరణ గావించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నేడొక ప్రకటనలో తెలిపారు. కోవిడ్ మహమ్మారి పెరుగుతున్న దృష్ట్యా కార్యక్రమాలలో పాల్గొనే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, మాస్కు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్స్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.