రాయల్ పోస్ట్ ప్రతినిధి డిసెంబర్ భువనగిరి టౌన్ / భువనగిరి పట్టణం లో జిల్లా సంక్షేమ కార్యాలయంలో బాలల పరిరక్షణ విభాగం, మహిళా, శిశు సంక్షేమ శాఖ, అధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కె. వి. కృష్ణవేణి మాట్లాడుతూ జిల్లాలో బాలిక విధ్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే విధంగా బాలికల ఆర్ధిక స్వావలంబన కోసం సుఖన్య సమృద్ది యోజన పథకం ద్వారా ప్రతి ఒక్క బాలిక కు మీ మీ స్థానికంగా గల పోస్ట్ ఆఫీసులో ఖాతా తెరిచి లబ్ది చేకూరే విధంగా చూడాలని తెలిపారు. అదే విధంగా జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ బండారు జయశ్రీ మాట్లాడుతూ బేటీ బచావో, బేటీ పడావో పథకం ద్వారా బాలిక రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని దీనికి సమాజంలోని ప్రతి ఒక్కరూ స్పూర్తితో ముందుకు వెళ్ళినప్పుడే బాలికల అభ్యున్నతి సాదించవచ్చని తెలిపారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి పులుగుజ్జు సైదులు మాట్లాడుతూ జిల్లాలో బాలికల సంరక్షణకు సంబందించి ముఖ్యంగా ఆడపిల్లల పై ఎలాంటి హింస కు పాల్పడకుండా మరియు వారి హుందాతనాన్ని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిందిగా తెలిపారు. అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ భూమయ్య మాట్లాడుతూ సుఖన్య సమృద్ది యోజన పథకం ద్వారా బాలికల అభ్యున్నతికి తోడ్పడుతుందని ప్రతి ఒక్కరూ 10 సం. ల లోపు బాలికలను ఈ పథకంలో చేర్పించవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రష్యాలోని ఎల్బ్రోస్స్ పర్వతాన్ని అధిరోహించిన మొట్ట మొదటి మహిళ కుమారి అన్విత రెడ్డి ని సన్మానించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో బాలిక హక్కుల పరిరక్షణ కోసం సామాజిక సమస్యలపై అవగాహనా పరుచుటలో భాగంగా గోడ పత్రికలను ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిల్లా బాలల సంక్షేమ సమితి ఛైర్మన్ బండారు జయశ్రీ, సఖి సెంటర్ నిర్వహకురాలు డా. ప్రమీల, జ్ఞానేశ్వర్, ఇండియన్ పోస్టల్ బ్యాంక్ మేనేజర్, భువనగిరి, సఖి సెంటర్ అడ్మిన్ CH. లావణ్య, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది, సఖి సెంటర్ సిబ్బంది, చైల్డ్ లైన్ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.