• టీటా గ్లోబ‌ల్ సింపోజియంలో రాష్ట్ర వ్య‌వ‌వ‌సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి
  • స‌మాజంలోని అంశాల ప‌రిష్కారం కోసం టీటా క‌ద‌ల‌డంపై ప్ర‌శంస‌లు
  • టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్తల చొర‌వ‌ను ప్ర‌శంసించిన మంత్రి సింగిరెడ్డి
  • 32 దేశాల‌కు చెందిన స‌భ్యుల‌తో వ‌ర్చువ‌ల్ విధానంలో విజ‌య‌వంతంగా జ‌రిగిన టీటా గ్లోబ‌ల్ సింపోజియం

హైద‌రాబాద్‌, జ‌న‌వరి 23, 2022: స‌మాజంలో ఎదుర్కుంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌కు టెక్నాల‌జీ ఆధారంగా ప‌రిష్కారం చూపేందుకు తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్‌ (టీటా) ఆధ్వ‌ర్యంలోని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ముందుకు రావ‌డం అభినంద‌నీయ‌మ‌ని తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌వ‌సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి తెలిపారు. ఐటీ ఫ‌ర్ సొసైటీ అండ‌ర్‌స్టాండ్ ప్రాబ్లం & స్టేట్మెంట్ అనే థీమ్‌తో టీటా గ్లోబల్‌ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల సార‌థ్యంలోని యువ ఇంజినీర్లు త‌మ సింపోజియంను వేదిక‌గా చేసుకోవ‌డం ఆహ్వానించ‌ద‌గ్గ ప‌రిణామమ‌ని మంత్రి పేర్కొన్నారు. టీహ‌బ్‌లో నిర్వ‌హించిన టీటా గ్లోబ‌ల్ సింపోజియంను ప్రారంభించిన అనంత‌రం మంత్రి రాష్ట్ర వ్య‌వ‌వ‌సాయ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్‌రెడ్డి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఎమ్మెల్సీ బండా ప్ర‌కాష్ స‌హా ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు. అధికారులు ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

ప్ర‌తి ఏటా నిర్వ‌హించే టీటా గ్లోబ‌ల్ వ‌ర్కింగ్ క‌మిటీ స‌మావేశం గ‌తంలోని ఒర‌వ‌డికి భిన్నంగ స్టార్‌హోట‌ల్‌ల‌లో కాకుండా కోవిడ్ ప్రొటొకాల్ పాటిస్తూ ఈసారి టీహ‌బ్‌లో ఏర్పాటు చేశారు. 50 దేశాల‌లో ప‌లువురు టెక్కీలు, టీటా స‌భ్యులు ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న ఈ జ‌న‌ర‌ల్ బాడీ మీటింగ్ ను మంత్రి నిరంజ‌న్‌రెడ్డి ప్రారంభించారు. అగ్రిక‌ల్చ‌ర్‌లో టెక్నాల‌జీ అనుసంధానం ఎలా అనే అంశంపై టీటాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు కృషి చేయ‌డం అభినందనీయ‌మ‌ని అన్నారు. స‌మాజంలోని అన్ని ర‌కాలైన అంశాల‌కు చెందిన స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేసి ప‌రిష్కారం చూపేందుకు టీటా వార్షిక స‌మావేశం వేదిక‌గా చేసుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని మంత్రి ప్ర‌శంసించారు. టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల సార‌థ్యంలోని యువ ఇంజినీర్ల‌కు త‌మ త‌ర‌ఫున పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీ బండా ప్ర‌కాష్‌ మాట్లాడుతూ వ్య‌వ‌సాయం, విద్య‌, వైద్య రంగాల‌కు చెందిన వాటితో పాటుగా సంక్లిష్ట‌మైన ర‌క్ష‌ణ రంగానికి చెందిన అంశాల‌పై కూడా టీటాకు చెందిన ఇంజినీర్లు స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేసి ప‌రిష్కారాలు రూపొందిచ‌డం వ‌ల్ల అనేక‌ర‌కాలైన ఇబ్బందులు తొల‌గిపోతాయ‌న్నారు. స‌మాజంలోని ఆయా అంశాల‌పై టీటాకు చెందిన ఇంజినీర్ల కృషి అభినందనీయ‌మ‌న్నారు.

జెఎన్‌టీయూ రెక్ట‌ర్ గోవర్ధన్ మాట్లాడుతూ, విద్యారంగంలోని స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి టీటా తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌న్నారు.
ఐహ‌బ్ చైర్మ‌న్ డాక్ట‌ర్ క‌ల్ప‌న మాట్లాడుతూ అన్న‌దాత‌లు ఎదుర్కుంటున్న వివిధ స‌మ‌స్య‌ల‌కు టెక్నాల‌జీ ఆధారిత ప‌రిష్కారాలు ఉత్త‌మ‌మార్గం నిలుస్తాయ‌న్నారు. లెఫ్టినెంట్ క‌ల్న‌ల్ బిక్ష‌ప‌తి మాట్లాడుతూ ర‌క్ష‌ణ రంగంలో వివిధ స‌వాళ్ల‌కు యువ ఇంజినీర్లు ఉత్త‌మ ప‌రిష్కారాలు చూప‌గ‌ల‌ర‌ని ధీమావ్య‌క్తం చేశారు.
కిమ్స్ ఆస్ప‌త్రికిచెందిన డాక్ట‌ర్ ప్ర‌త్యూష , నిమ్స్ త‌ర‌పున విచ్చేసిన‌ రమేష్ మార్తా వైద్య‌రంగంలోని స‌వాళ్ల‌ను వివ‌రించారు.

ఈ సింపోజియం సంద‌ర్భంగా వివిధ రంగాల‌కు చెందిన స‌మస్య‌ల‌ను స్వీక‌రించిన సాప్ట్‌వేర్ ఇంజినీర్లు వాటిని అధ్య‌య‌నం చేసి అదే రోజు సాయంత్రం ప‌రిష్కార‌మార్గాల‌ను అందించారు. సంబంధిత రంగానికి చెందిన నిపుణులు వీటిని అధ్య‌య‌నం చేసిన అనంత‌రం సంయుక్తంగా ప‌రిష్కారం చూపించ‌నున్నారు.

టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌ఖ్త‌ల మాట్లాడుతూ,గ‌త‌ 12ఏళ్లుగా దాదాపు 50 దేశాల‌కు పైగా టెక్కీల‌తో టీటా సింపోజియంను ప్ర‌తి సంవ‌త్స‌రం నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. ఈ ద‌ఫా త‌మ సంస్థ‌గ‌త స‌మావేశానికి తోడుగా స‌మాజంలోని వివిధ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఐటీ ఫ‌ర్ సొసైటీ అండ‌ర్‌స్టాండ్ ప్రాబ్లం & స్టేట్మెంట్ అనే థీమ్ ఎంచుకున్న‌ట్లు వెల్ల‌డించారు. విద్యా, వైద్యం, వ్య‌వసాయం, చారిత్ర‌క సంప‌ద ప‌రిర‌క్ష‌ణ స‌హా అనేక రంగాల్లో ఇప్ప‌టివ‌ర‌కు వివిధ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు వివ‌రించారు. దీనికి కొన‌సాగింపుగా తాజా సింపోజియంలో మ‌రిన్ని రంగాల‌కు చెందిన స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేసి ప‌రిష్కారం చూపించిన్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌ను స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేసి ఫ‌లితాలు రూపొందించ‌నున్న‌ట్లు తెలియ‌జేశారు. త‌మ సింపోజియంలో వివిధ రంగాల‌కు చెందిన నిఫుణులు ఆయారంగాల స‌మ‌స్య‌లు ప్ర‌స్తావిస్తూ త‌మ‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు వ‌చ్చార‌ని తెలిపిన సందీప్ మ‌ఖ్త‌ల ఈ మేర‌కు త్వ‌ర‌లో అవి కార్య‌రూపం దాల్చ‌నున్నాయ‌ని తెలియ‌జేశారు.