రాయల్ పోస్ట్ ప్రతినిధి భువనగిరి:- గత 2014 ఎన్నికల సమయంలో కేసీఆర్ ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీని అమలు చేయాలని వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ భువనగిరి పార్లమెంట్ కో కన్వీనర్ మహమ్మద్ అతహర్ డిమాండ్ చేశారు. అతహర్ శనివారం విలేకరులతో మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో తను అధికారంలోకి రాగానే 6 నెలల లోపు ముస్లిం మైనారిటీలకు12 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తానని మాయమాటలు చెప్పి ఇంతవరకు దాని ఊసే ఎత్తడంలేదని దుయ్యబట్టారు ఇది కేసీఆర్ చేతకానితనానికి నిదర్శనమా లేక ముస్లింల మీద ఉన్న సవితి తల్లి ప్రేమనా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ముస్లిం సమాజం గురించి ఆలోచించి ఒక కమిటీ వేసి వారియొక్క స్థితిగతులు చాలా హీనంగా ఉన్నాయని తెలుసుకొని పేద ముస్లింలకు రిజర్వేషన్లు ఎంతో అవసరం అని విద్య, ఉద్యోగాలలో 4 శాతం రిజర్వేషన్లు కల్పించి వారియొక్క అభివృద్ధికి తోడ్పడ్డారని గుర్తుచేశారు .ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ని ఎప్పటికీ మర్చిపోలేదని కొనియాడారు. 4 శాతం రిజర్వేషన్ల వలన ఈరోజు ఎంతోమంది పేద ముస్లిం విద్యార్థినీ, విద్యార్థులు డాక్టర్లు, ఇంజినీర్లు అవుతున్నారని అన్నారు. కానీ కెసిఆర్ మాత్రం ముస్లిం లను ఓటు బ్యాంకు గా వినియోగించుకుంటూ కరివేపాకు లాగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రెండు సార్లు కేసీఆర్ ముస్లింల ఓట్లతో గద్దెనెక్కారని ముస్లిం లకు గద్దె ఎక్కియడం తెలుసు మరియు గద్దె దింపడం తెలుసు అని హెచ్చరించారు.రాబోయే ఎన్నికలలో ముస్లింలు తమ ఓటుతో కేసీఆర్ ను గద్దె దింపి ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామని ఘాటుగా స్పందించారు.ఈ సారి మాత్రం కేసీఆర్ ముస్లింల ఆగ్రహానికి గురికాక తప్పదని హితవుపలికారు..