రామడుగు మండలం రంగశాయిపేట గ్రామానికి చెందిన దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి కార్యదర్శి చిలుముల రమేష్ అందించిన సమాచారం ప్రకారం, దుబాయ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ అథారిటీ మరియు UAE తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా దుబాయ్ లోనిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన సేవాసమితి సభ్యులు, ఈ సందర్భంగా సేవాసమితి అధ్యక్షుడు రవి ఊట్నూరి మాట్లాడుతూ కొరోనా మహమ్మారి కారణంగా ప్రతి చోట రక్తం కొరత ఏర్పడింది ఈ సందర్భంగా దుబాయ్ హెల్త్ అథారిటీ కోరికమేర యూఏఈ లోని సామాజిక సంస్థలు రక్తదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారి వారి కమ్యూనిటీల ద్వారా రక్తం సేకరించడం జరుగుతుంది, ఈ సందర్భంగా సేవాసమితి ని కోరగా దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి తరుపున గంగాధర్ అలిగేటి, రవి డేవిడ్, చిలుముల వినోద్, సతీష్ కుమార్, రాజ్ దీప్, ప్రదీప్ కుమార్ పాల్గొని రక్తదానం చేయడం జరిగింది, ఈ కార్యక్రం లో పాల్గొన్న సేవాసమితి సభ్యులను యూఏఈ తెలుగు అస్సోసియేన్ వారు ప్రశంసించారు.